13 June, 2026 | 10:36 PM

జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

13-06-2026 09:25 PM

సూర్యాపేట,(విజయక్రాంతి): పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ జిల్లా నూతన  కార్యవర్గ ఎన్నికను శనివారం పట్టణంలోని పద్మశాలి భవనంలో చేపట్టారు. ఈ కార్యవర్గంలో జిల్లా అధ్యక్షులు గొగుల నాగరాజు, కార్యదర్శి కొప్పుల బక్కయ్య, ఉపాధ్యక్షులు ఎన్ గంగరాజు, నరేందర్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు శేరిక, సంయుక్త కార్యదర్శులు రావుల నరేందర్, గుగులోతు రమేష్, సింగం శ్రీధర్, జేషన్ రాజ్, నిర్వహణ కార్యదర్శులు ఎస్ కె సోందు, నెహ్రూ, కోశాధికారి సంతోష్, మీడియా కన్వీనర్ మధు, సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కృషి చేస్తానని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.