బిజెపి కుకునూరుపల్లి మండల నూతన కమిటీ ఎన్నిక
మండల అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి...
కొండపాక: బిజెపి రాష్ట్ర శాఖ, మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు(MP Madhavaneni Raghunandan Rao), సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్(BJP President Bairi Shankar Mudiraj)ల ఆదేశాల మేరకు కుకునూరుపల్లి మండల నూతన కమిటీని నియమించినట్లు గురువారం కునూరుపల్లి మండల బిజెపి అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనుముల సంపత్ రెడ్డి మాట్లాడుతూ... పార్టీ సిద్ధాంతాలకు, నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేయాలని, రాబోయే ఎలక్షన్లలో భారీ మెజార్టీ స్థానాల్లో గెలిచే విధంగా ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పని చేయాలని అన్నారు.
కుకునూరుపల్లి మండల బిజెపి ఉపాధ్యక్షులుగా దాసరి స్వామి, మంద రాజు, గట్టు అనిల్, సున్నం అశోక్, ప్రధాన కార్యదర్శులుగా బోనాల రాజు, రెడ్డమైన నాగరాజు, సెక్రటరీలుగా గుర్రాల స్వామి, దొంతి సత్తయ్య, పట్టు ప్రేమ్చందర్ రెడ్డి, రాగం రమేష్ యాదవ్, ట్రెజరీ గా మలిపెద్ది రమేష్, 30 మంది కమిటీ సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కమిటీ తక్షణమే అమలు అవుతుందని ఒక ప్రకటనలో తెలిపారు.






