2 September, 2026 | 10:27 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక

14-07-2026 | 07:12pm

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి మండల  పి ఆర్ టి యు టి ఎస్ ఉపాధ్యాయ సంఘ నూతన అధ్యక్షులుగా ఇ.వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గా ఎ. అనిల్ కుమార్ రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ ఎన్నిక జిల్లా అధ్యక్షులు వై. రామేశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సిహెచ్. ఆనంద్ రెడ్డి సమక్షంలో జరిగింది. మండల అసోసియేట్ అధ్యక్షులుగా సామ భూపాల్ రెడ్డి, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా ఎన్. మాధవి, ఉపాధ్యక్షులు గా బాలరాజ్, అరుణ, కార్యదర్శులుగా జబ్బార్ ,లావణ్య ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు విజయలక్ష్మీ, భాగ్యలక్ష్మి, జ్యోతి, మార్టిన్, శ్రీరామ్ ప్రసాద్, ఆల్వాల్  అధ్యక్షులు నర్సింహా, ప్రధాన కార్యదర్శి కైలాసపతి తదితరులు పాల్గొన్నారు.