2 September, 2026 | 4:04 PM

కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

14-07-2026 | 06:52pm

ఉప్పల్,(విజయక్రాంతి): అమావాస్య పురస్కరించుకొని నేపథ్యంలో ఉప్పల్ భగత్ కాలభైరవ స్వామి దేవాలయంలో మంగళవారం రోజున ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని అర్చన అభిషేక కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలభైరవ ఆశీస్సులతో ఉప్పల్ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని  ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.