14 July, 2026 | 7:03 PM

పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు

14-07-2026 06:59 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని సింగార్ బొగూడ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని పైకప్పు, గోడల ప్లాస్టర్ పెచ్చులూడుతుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. తరగతి గదుల్లో కూర్చొని పాఠాలు వినేందుకు విద్యార్థులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భవనం మరింత ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో తల్లిదండ్రులు కూడా పిల్లలను పాఠశాలకు పంపడంపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే పాఠశాల భవనాన్ని పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు విద్యార్థులకు సురక్షితమైన తరగతి గదులను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.