26 August, 2026 | 7:54 PM

పోచారం ప్రాజెక్టును తక్షణమే పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి

26-08-2026 06:55 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పోచారం ప్రాజెక్టును బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు పైడి ఎల్లారెడ్డి మండల బిజెపి నాయకులతో కార్యకర్తలతో కలిసి సందర్శించి ప్రాజెక్టు అందాలను తిలకించారు.గత నెల రోజులుగా పొంగిపొర్లుతున్న అలుగును చూసి సంతోషం వ్యక్తం చేశారు. పోచారం ప్రాజెక్టును తక్షణమే పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ...పోచారం ప్రాజెక్టును పూర్తిస్థాయి పర్యటక కేంద్రంగా మార్చడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని,పర్యటక వసతులు,బోటింగ్ సౌకర్యం,హరిత పిల్లల ప్లే ఏరియాలు మరియు విక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు శ్రీనివాస్,మండల మాజీ ఎంపీపీ దివిటి రాజదాస్,నాయకులు దేవి సింగ్,హనుమాన్లు,గణేష్ కిషన్,భాస్కర్,ఆకుల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.