యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రవేటీకరణ హేయమైన చర్య
మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు
మిర్యాలగూడ, జూన్ 12: యాదాద్రి పవర్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్ని స్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంది హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంత విద్యుత్ అవసరాలను తీర్చేందుకు గత బారాస ప్రభుత్వం సుమారు రూ.30 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బారాస ఆధ్వర్యంలో శుక్రవారం ప్లాంట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఈ ప్రాంతానికి పవర్ ప్లాంట్ ఆవశ్యకత విద్యుత్ సమస్య పరిష్కారం కొరకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరిన వెంటనే భారీ వ్యయంతో నిర్మించే పవర్ ప్లాంట్ ను మంజూరు చేసి విద్యుత్ సమస్య పరిష్కారంతో పాటు ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి భూ నిర్వాసితులకు సహాయంలో భాగంగా వారి కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ంచే దుకు చర్యలు చేపట్టిందన్నారు.
అందులో భాగంగా భూ నిర్వాసితుల కుటుంబాలలో కొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మిగిలిన 700 మంది భూ నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాల కల్పనలో ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ప్రజా ఆస్తులను కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణ కోసం బారాస ప్రజలతో కల్సి ఉద్యమిస్తుందని ఆ యన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎండి యూసుఫ్, కోటిరెడ్డి, సైదులు సైదిరెడ్డి, వీరబాబు నాగిరెడ్డి, సత్యనారాయణ, గోపి కోటయ్య, నరసయ్య, రమావత్ వినోద్ నాయక్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






