ఇల్లందు ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షులుగా రవీందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా కడారి నటరాజ్
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు ప్రజా ప్రశ్నించే గొంతుక ప్రెస్ క్లబ్ నూతన కమిటీని మాజీ గౌరవ అధ్యక్షులు పసుమర్తి లక్ష్మణ్, లీగల్ అడ్వైసర్ దంతాల ఆనంద్ ఆధ్వర్యంలో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా నరేంద్రుల అను బాబు, అధ్యక్షులుగా పెద్దబోయిన రవీందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా కడారి నటరాజ్, ఉపాధ్యక్షులుగా షేక్ సలీం, కాపు సురేష్ , కార్యదర్శి గా జహరా భీ, కోశాధికారిగా దొడ్డ రాజు, సహాయ కార్యదర్శులుగా ఈర్ల రవి కుమార్, దనకొండ రవి, కార్యవర్గ సభ్యులుగా పబ్బు శివ, సెంసాని వెంకటేష్, పబ్బు సురేష్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తూనే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. నూతన కార్యవర్గాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.




