సీసీ రోడ్డు కమిషన్ల కోసం కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట.!
అధికారుల ముందే పంపకాల వ్యవహారం.
పోలీస్ స్టేషన్కు చేరిన సీసీ రోడ్లు కమిషన్ల పంచాయతీ
నాగరుకర్నూల్,(విజయక్రాంతి): బిజినపల్లి మండలం బోయాపూర్ గ్రామంలో ఏడాది క్రితం రు.10 లక్షలతో వేసిన సీసీ రోడ్డు కమిషన్ల(Commissions) పంచాయతీ బుధవారం పోలీస్ స్టేషన్ కు చేరింది. రూ. 10 లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి బోయపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు రూ.70వేలు వసూళ్లు చేయగా వాటి పంపకంలో సయోధ్య కుదరకపోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఏకంగా అధికారుల ముందే పంపకలు జరుపుకోవడం అందులో అయోధ్య కుదరకపోవడంతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి నెలకొంది. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోగా చివరికి పెద్ద సారు మందలించినట్లు తెలిసింది. చివరగా ఈ పంచాయతీ పెద్ద సార్ ముందుకు వెళ్లడంతో చర్చనీయంశంగా మారింది.
మండలంలోని బోయాపూరు గ్రామంలో ఏడాది క్రితం రూ.10 లక్షలతో సీసీ రోడ్లు మంజూరు కాగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు వెయ్యడానికి కాంట్రాక్టర్ వద్ద నుండి రూ.70 వేలకు ఒప్పందం చేసుకున్నారు. తర్వాత 8.5 లక్షల బిల్లు ఈ వారమే కాంట్రాక్టర్ ఖాతాలో పడింది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కాంట్రాక్టర్ వద్ద నుండి రూ.70 వసూళ్లు చేశారు. కనిషనులో రూ.50 వేలు అధికారి సాక్షిగానే బదిలీ అయింది. ఆ తర్వాతనే చెక్కు డిపాజిట్ అయి కాంట్రాక్టర్ చేతికి డబ్బులు ముట్టాయి.
మొత్తం రూ. 70 వేల కమిషనులో రూ.60 వేలు యూపిఐ ద్వారా పేమెంట్ కాగా, మిగిలిన పదివేలు నగదు రూపకంగా బదిలీ చేసుకున్నారు. సోమవారం ఈ పంపకాలు పూర్తి కాగా మంగళవారం సాయంత్రం బొయాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో గాయపడిన సైదులు అనే కార్యకర్త పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. . ఈ విషయంలో బిజినపల్లి ఎస్సై శ్రీనివాసులను వివరణ కోరగా బోయపూర్ గ్రామానికి చెందిన సైదులు అనే వ్యక్తి నుండి ఫిర్యాదు అందిందని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.




