శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ కమిటీ ఎన్నిక
23-08-2026 | 02:47pm
గణపురం,ఆగస్టు 23 (విజయక్రాంతి): మండలంలోని ధర్మారావుపేటలో ముదిరాజ్ ల ఆరాధ్య దైవంశ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ(Sri Peddamma Thalli Temple) నిర్మాణ కమిటీ నిర్మాణ కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం శివాలయం ప్రాంగణంలో మత్స్య సహకార అధ్యక్షులు ఆకుల రాజయ్య ఆధ్వర్యంలో ముదిరాజ్ కులస్తులను సమావేశ పరచి అనంతరం కులస్తుల సమక్షంలో ఆలయ నిర్మాణ కమిటీ వెయ్యడం జరిగింది.
ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులుగా ఆకుల సుభాష్ ముదిరాజ్ ఉపాధ్యక్షులు గా సాదు కరుణాకర్ ముదిరాజ్ ప్రధానకార్యదర్శి ఆకుల క్రిష్ణ స్వామి ముదిరాజ్ సహాయ కార్యదర్శి గా ఆకుల రాజ్ కుమార్ ముదిరాజ్ సభ్యులుగా ఆకుల రాజయ్య ముదిరాజ్ ఆకుల సదానందం ముదిరాజ్ మాల సాంబయ్య ముదిరాజ్ ఊరడి రాజయ్య ముదిరాజ్ ఆకుల శ్రీనివాస్ (చింటూ )ముదిరాజ్ ఆకుల సంపత్ ముదిరాజ్ ఆకుల రమేష్ ముదిరాజ్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.