23 August, 2026 | 3:28 PM

హల్దీ వేడుకకు వెళ్తూ, అనంతలోకాలకు

23-08-2026 02:57 PM

అతివేగంతో అదుపు తప్పిన కారు, భార్య భర్తలు మృతి

తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు

చందుర్తి,ఆగష్టు 23,(విజయక్రాంతి): మండలంలోని( Chandurthi Mandal) లింగంపేట గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రుద్రంగి మండల కేంద్రానికి మహామ్మద్ సాదుల్లా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు తమ స్వంత కారులో చందుర్తిలో నిర్వహించే హల్దీ వేడుకకు వస్తుండగా లింగంపేట శివారులో సాదుల్లా నడుపుతున్న బ్రేజ్జా కారు మూల మలుపు వద్ద అతి వేగంతో అదుపుతప్పి ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సాదుల్లా మరియు అతని భార్య హాసీనా అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

కారు ప్రమాదంలో ఒక చిన్నారి రింషా (16) తో సహా మరో ఇద్దరు హాసీనా (50), సమీరా (35) లు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే స్థానికుల సహాయంతో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించగ,  వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వేడుకకు వెళ్తుండగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో రుద్రంగి, చందుర్తి గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.