తుఫాను ప్రభావంతో వర్షం.. రైతులకు ఊరట

23-08-2026 | 02:02pm

15 రోజుల తర్వాత మోస్తరు వర్షం

గణపురం,ఆగస్టు 23(విజయ క్రాంతి): వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఆదివారం కురిసిన మోస్తరు వర్షం ఊరటనిచ్చింది. తుఫాను ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో ఎండలతో ఎండిపోతున్న పంటలకు కొంత ఉపశమనం లభించింది. వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు తాజా వర్షాలు ఆశలు కల్పించాయి. ముఖ్యంగా పత్తి, మిరప, వరి తదితర పంటలకు ఈ వర్షం ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. రానున్న రోజుల్లోనూ వర్షాలు కొనసాగితే పంటల సాగుకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఆగస్టు 23 నుంచి 26 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు