కోనరావుపేట ఎస్సై రాంమోహన్‌కు వాకర్స్ క్రికెట్ క్లబ్ అభినందనలు
23-08-2026 02:43 PM
కోనరావుపేట, ఆగస్టు 23 (విజయక్రాంతి): కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చి సబ్‌ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాంమోహన్‌ను వాకర్స్ క్రికెట్ క్లబ్ (డబ్ల్యూ సీసీ) వేములవాడ వారి ఆధ్వర్యంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సై రాంమోహన్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, సన్మానించారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూ సీసీ అధ్యక్షులు మొటూరి ప్రవీణ్‌తో పాటు మనోజ్, రామనరావు, తిరుపతి, గోపాల్, ప్రశాంత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.






