calender_icon.png 8 December, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నియమాలను పాటించాలి..

08-12-2025 07:48:31 PM

* తలమడుగు ఎస్సై రాధిక..

* గ్రామాలలో పోలీస్ కవాతు..

తలమడుగు (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మండలంలో జరిగే ప్రతి ఒక్క గ్రామంలో పోలీసులు సూచించిన నియమాలను పాటించాలని తలమడుగు ఎస్ఐ రాధిక తెలిపారు. పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రజలు భరోసా కల్పించేందుకు గ్రామాల్లో పోలీసులు కవాతులు నిర్వహిస్తున్నారు. ఎస్ఐ రాధిక మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు.

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని 100 మీటర్ల వద్ద 200 మీటర్ల వద్ద ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని వాటిని పాటించాలని, ప్రజల అనవసరంగా గుమిగూడి ఉండరాదని తెలిపారు. వాట్సాప్ లో, సోషల్ మీడియాలో ఇతరులను రెచ్చగొట్టేలా, కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై పోలీసు నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎలాంటి సమాచారం అయినా డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని, గొడవలకు, అల్లర్లకు పాల్పడవద్దన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, అధికారుల అనుమతితో నిర్ధారించిన రోజులలో అనుమతి తీసుకుని నిర్వహించుకోవాలి.