calender_icon.png 8 December, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల దృష్ట్యా బైండోవర్

08-12-2025 07:49:31 PM

మోతే,(విజయక్రాంతి): పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మండల పరిధిలోని ఆరు గ్రామాలకు చెందిన 73 మందిని సోమవారం మోతె తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్టు స్థానిక ఎస్ ఐ టి. అజయ్ కుమార్ తెలిపారు. రాఘవపురం, రాఘవపురం ఎక్స్ రోడ్డు, కొత్తగూడెం, తుమ్మలపల్లి, అప్పన్నగూడెం, నామవరం గ్రామాలలో కాంగ్రెస్, బి. ఆర్. ఎస్ న్యూ డెమోక్రసీ  సి. పి. ఏం పార్టీల ముఖ్య నాయకులు, సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్ దాఖలు చేసిన వారిని రూ.2 లక్షల పూచీకత్తుతో బైండ్ ఓవర్ చేసినట్టు తెలిపారు.

బైండోవర్ అయిన వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదైన రూ.2 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు నాయకులు, ప్రజలు సహకరించాలని ఎస్ఐ అజయ్ కుమార్ కోరారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తేదీ నుండి సోమవారం వరకు సుమారు 170 మందికి పైగా వ్యక్తులను బైండోవర్ చేసినట్టు  ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు.