28 July, 2026 | 10:07 AM

చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక

25-06-2024 01:03 PM

న్యూఢిల్లీ: స్పీకర్ పదవికి చరిత్రలోనే తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీయే ప్రతిపాదించిన ఓంబిర్లాకు ఇండియా కూటమి మద్దతివ్వలేదు.  స్పీకర్ అభ్యర్థి అంశంపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇండియా కూటమి ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపాదన చేయగా.. అందుకు ఎన్డీయే స్పందించలేదు.

అధికార పక్షం తీరుపై ఇండియా కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్ సభ స్వీకర్ పదవికి ఎన్డీయే తరపున ఓంబిర్లా, ఇండియా కూటమి తరుపున కే. సురేశ్ నామినేషన్ దాఖలు చేశారు. దేశంలో ఇప్పటివరకు స్వీకర్లంతా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు.