28 July, 2026 | 10:44 AM

స్పీకర్ పదవికి నామినేషన్లు... ఓంబిర్లా మరోసారి నామినేషన్

25-06-2024 12:03 PM

న్యూఢిల్లీ: పార్లమెంటులో మంగళవారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పోస్టులకు నామినేషన్ల ప్రక్రియ జరుగనుంది. ఇప్పటికే కేంద్రమంత్రులు, ఎంపీలు పార్లమెంట్ కు చేరుకున్నారు. లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్డీయే తరుపున ఓంబిర్లా మరోసారి నామినేషన్ వేయనున్నారు. 

సోమవారం ఉదయం ప్రధాని మోదీని ఓం బిర్లా కలిశారు. రాజస్థాన్ లోని కోట నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికైనా ఆయన 2019లో తొలిసారి లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు. కాగా నామినేషన్లపై రాజీ కుదిర్చేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రతిపక్షాలను సంప్రదిస్తున్నారు.