28 July, 2026 | 9:16 AM

ఎన్డీయే ఖర్గేను అవమానించింది : రాహుల్ గాంధీ

25-06-2024 01:23 PM

న్యూఢిల్లీ: జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను అధికారపక్షం అవమానించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభ స్పీకర్ ఎన్నికకు సహకరించాలని అధికారపక్షం ఇండియా కూటమిని కోరిందన్నారు. సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని అడిగినట్లు ఆయన వెల్లడించారు.

డిప్యూటీ స్పీకర్ పదవిపై ఖార్గేతో చర్చిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం అన్నారని, ఇప్పటివరకు ఖర్గేనే చర్చలకు పిలవలేదని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ ను ఖరారు చేయకుండానే స్పీకర్ ఎన్నికకు సహకరించాలన్నారు. ఎన్డీయే తీరు ఇండియా కూటమిని అవమానించేలా ఉందని రాహుల్ గాంధీ మండిపడ్డారు.