calender_icon.png 12 February, 2026 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

12-02-2026 02:09:51 AM

పోలింగ్ సరళిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్,ఎస్పీ

అలంపూర్, ఫిబ్రవరి 11 గద్వాల జిల్లాలోని అలంపూర్ , వడ్డేపల్లి, అయిజ ము నిసిపల్ ఎన్నికల సంబంధించి పోలింగ్ ప్రక్రి య బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. సాయంత్రం 5 గంటలకు ముగిసింది.ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మూడు మున్సిపాలిటీ లతో కలిపి మొత్తం 40 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరిగాయి.వడ్డేపల్లి మున్సిపాలిటీ లో జరుగుతున్న పోలింగ్ సరళిని జి ల్లా కలెక్టర్ బీఎం సంతోష్,ఎస్పీ శ్రీనివాసరా వు తనిఖీ చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పా టు చేశారు. అయితే వడ్డేపల్లి మున్సిపాలిటీ లో గందరగోళ పరిస్థితిలో నెలకొనే క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టే షన్కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి వారితో మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పా ర్టీ అక్రమ అరెస్టులకు పాల్పడడం సమంజసం కాదని అరాచకం , దౌర్జన్యంగా వివరి స్తున్న పార్టీకి  ప్రజలు ఓటుతోనే బుద్ధి చెబుతారన్నారు.కాగా పుర ఎన్నికల్లో  వృద్ధులు ,యువకులు, మహిళలు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.