calender_icon.png 12 February, 2026 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రాలకు ఆసక్తితో ఓటర్లు

12-02-2026 02:08:29 AM

జిల్లావ్యాప్తంగా 69. 6 శాతం పోలింగ్

మహబూబ్ నగర్ టౌన్, ఫిబ్రవరి 11 : పట్టణ ప్రాంతంలో ఓటింగ్ శాతం తగ్గుతుంది అనుకున్నప్పటికీ ఆశించిన స్థాయి కంటే అత్యధికంగానే నమోదు కావడంతో  గెలుపు తమదంటే తమదే అనే ధీమాతో ఉన్నారు. డివిజన్, వార్డు స్థాయిల్లో ఎన్నికలు జరగడంతో మహబూబ్ నగర్ తో పాటు దేవరకద్ర,

భూత్పూర్ మున్సిపాలిటీలో కూడా ఓటింగ్ శాతం అభ్యర్థులు ఆశించడం మేరకు నమోదు అయిందని పేర్కొంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రానికి రప్పించేందుకు అభ్యర్థులు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ఓటింగ్ శాతం ఈ మేరకు వచ్చిందని పలువురు పేర్కొంటున్నారు.