ఆర్టీసీలో త్వరలో ఎన్నికలు
ఎన్నికల తర్వాత విలీనంపై ముందుకు
2,932 కొత్త బస్సుల కొనుగోలు
15 ఏళ్లు దాటిన బస్సులకు బ్రేక్
అసెంబ్లీలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని, ప్రస్తుతం అందు కు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తెలిపారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన సంఘం ప్రతినిధులను అధికారుల కమి టీలోకి తీసుకొని విలీన ప్రక్రియను ముందు కు తీసుకెళ్తామని చెప్పారు. విలీన ప్రక్రియ లో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. గురువారం శాస నసభలో ఆర్టీసీపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
గత ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల బాటలోకి నె ట్టిందని, కార్మికుల సమస్యలను సైతం పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక డి మాండ్కు మేరకు కొత్త సర్వీసులు ప్రారంభిచండంతో పాటు అదనపు ట్రిప్పులు నడుపు తున్నామని చెప్పారు. కరోనా సమయంలో రద్దయిన బస్సులను కూడా పునరుద్ధరిస్తున్నామని, పాత సర్వీసుల స్థానంలో కొత్తవా టిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 347.47 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి రూ.12,171 కో ట్లు ఆదా చేసుకున్నారని వెల్లడించారు.
ఇప్పటివరకు 2,932 కొత్త బస్సులను కొనుగోలు చేశామని, 15 ఏళ్లు దాటిన బస్సుల సేవలను నిలిపివేస్తున్నామని తెలిపారు. 340 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా రెట్రోఫిట్ చేశామని, హైదరాబాద్ నగర పరిధిలో పీఎం ఈడ్రైవ్ కింద 2,200 ఈ తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రీమియం కేటగిరీతో పాటు ఎలక్ట్రిక్ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఆది లాబాద్ జిల్లాలో జిల్లా ఎస్పీ సహకారంతో బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలు 97 ఉండగా, అదనంగా పెద్దపల్లి, ములుగు డిపోలు ఏర్పాటు చేశామని చెప్పా రు. పేదల ఇండ్ల నిర్మాణానికి ఆర్టీసీ స్థలాల ను తీసుకుంటే, ఆర్టీసీ అభివృద్ధికి అవసర మైన ప్రభుత్వ స్థలాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. సర్వీ సు నుంచి తొలగింపునకు గురైన 244 మం ది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నామని, 1,430 మందికి కారుణ్య నియామ కాల కింద ఉద్యోగాలు కల్పించామని తెలిపా రు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ కుటుం బంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు మంజూరకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.