హెచ్‌డబ్ల్యువో జీసీ.రాజు అక్రమ బదిలీనీ రద్దు చేయాలి
02-03-2026 01:24 AM
ముషీరాబాద్, మార్చి 1(విజయక్రాంతి): వనపర్తి ఎస్సీ- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జిసి రాజు అక్రమ బదిలీని రద్దు చేసి విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని పీడీఎ స్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కే.గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేసినట్లు ఆయ న తెలిపారు.
ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడు తూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న హెచ్‌డబ్ల్యూఓ జీసి రాజును తక్షణమే విధులనుండి సస్పె ండ్ చేయాలని సోషల్ వెల్ఫేర్ కమిషనర్‌కు ఇచ్చిన ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు.




