05-12-2025 12:44:51 AM
రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి
ఉమ్మడి జిల్లా ఎస్పీలతో సమీక్ష
ఆదిలాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాం తి): గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించేలా పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి జిల్లా పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో మూ డు విడుతలుగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గురువారం ఆదిలాబాద్ లోని పోలీస్ హెడ్ క్వాటర్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీలతో రాష్ట్ర డీజీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.... ఎన్నికల్లో కోడ్ నియమాలని కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నేపథ్యంలో అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్ట్ ల వద్ద తనిఖీలు చేపట్టాలన్నారు. మతపరమైన సమస్యలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలలో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు.
ఎన్నికలలో సమస్యలను సృష్టించే వారిని బైండోవర్ చేస్తూ ఉండాలి అన్నారు. ప్రజలలో నమ్మకం పెంచేందుకు, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలలో పోలీసులు పట్ల ధైర్యం నింపాలన్నారు. జిల్లావ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు చేయాలని తెలిపారు. గ్రామాలను సందర్శిస్తూ ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అలాంటి ఆవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పర్యవేక్షించాలి అని తెలిపారు. గ్రామాలలో ఎన్నికలు నిర్వహించకుండా వేలం పాటలు వేసే వారిపై చర్యలు చేపట్టాలన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ సిబ్బందిని కేటాయించాలని తెలిపారు. ఈ సమావేశంలో మల్టీ జోన్ వన్ ఐజి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, ఐజి ూూ ఎం రమేష్, అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల, ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, మంచిర్యాల్ ఎసిపి ఎగ్గడి భాస్కర్, అదనపు ఎస్పీలు కాజల్ సింగ్, బి సురేందర్ రావు, ఏఎస్పి చిత్తరంజన్, పి మౌనిక, డీఎస్పీలు వహీదుద్దీన్, వెంకటేశ్వర్, పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి ఉమ్మడి జిల్లా అధికారులు సిఐలు సిబ్బంది పాల్గొన్నారు.