4 March, 2026 | 10:38 PM

గోదావరి పుష్కరాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

04-03-2026 08:56 PM

మంథనిలో గోదావరి పుష్కర ఘాట్ల పరిశీలనలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి

మంథని,(విజయక్రాంతి): గోదావరి పుష్కరాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పెద్దపెల్లి డీసీపీ రామ్ రెడ్డి తెలిపారు. బుధవారం మంథని లోని గోదావరి నది, సుందిల్లా జలాశయాన్ని, సుందిల్లా గ్రామ శివారులోని గోదావరి సమీపంలోని పుష్కరఘాట్లను పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి  సందర్శించారు.

వచ్చే ఏడాది జరిగే పుష్కరాల నేపథ్యంలో ఘాట్ల వద్ద భక్తుల రాకపోకలు, సీసీ కెమెరాల పనితీరు, పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాపిక్ మళ్లింపులు వంటి అంశాలపై పోలీసు అధికారులతో మాట్లాడారు. భక్తులు సురక్షితంగా ప్రశాంత వాతావరణంలో ఘాట్లను వినియోగించుకునేలా అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి పనిచేయాలని సూచించారు. డిసిపి వెంట గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంథని సీఐ బి.రాజు, గోదావరి ఖని-2 టౌన్ సీఐ ప్రసాద్ రావు, ఎస్ఐ రమేష్ ఉన్నారు.