calender_icon.png 5 December, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి

05-12-2025 12:46:00 AM

కలెక్టర్‌ల వీడియో కాన్వరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశం

ఆదిలాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాం తి) : గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికు ముదిని అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో హైద్రాబాదు నుండి ఆమె వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ... గ్రామపంచాయతీ ఎన్నికల ను పకడ్బందీగా నిర్వహించాలని, ఉపసర్పంచ్ ఎన్నికల ఎన్నిక పారదర్శంగా జరపా లన్నారు.

ఇప్పటివరకు పూర్తి చేసిన నామినేషన్ల ప్రక్రియ, ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు సభ్యుల వివరాలను జిల్లాల వారీగా కలెక్టర్ల ను అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ... జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. ఆర్వో స్టేజ్ 2 జోనల్ అధికారులు వెంటనే పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.

పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రోడ్డు మార్గాలను పరిశీలించాలని వివరించారు. నిర్దేశించిన జాబితా ప్రకారం పోలింగ్ కేంద్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో చూడాలని చెప్పారు. సిబ్బంది, ఎన్నికల సామాగ్రి తరలింపునకు అనువైన వాహనాలను వెంటనే సమకూర్చాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆబ్సర్వర్ టి. వెంకన్న, ఎల్. విజయ, అదన పు కలెక్టర్ శ్యామలాదేవి, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.