4 March, 2026 | 10:33 PM

వాహనం అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టిన యువకుడు

04-03-2026 08:40 PM

చిట్యాల,(విజయక్రాంతి): వేగంగా ద్విచక్ర వాహనం నడపడంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్ కు ఢీకొట్టడంతో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన చిట్యాల మండలంలోని  గుండ్రాంపల్లి సమీపంలో  బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పిట్టంపల్లి గ్రామానికి చెందిన బద్దుల శ్రీకాంత్ గుండ్రాంపల్లి నుంచి తన స్వగ్రామానికి బైక్ పై వేగంగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో శ్రీకాంత్‌ తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో

అప్రమత్తమైన స్థానికులు వెంటనే చిట్యాల పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై మామిడి రవికుమార్ వెంటనే సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన శ్రీకాంత్‌ను అంబులెన్స్‌లో చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. సమయానికి చికిత్స అందడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించిన ఎస్సై రవికుమార్‌ను స్థానికులు అభినందించారు.