08-01-2026 12:34:45 AM
ముషీరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతే జెడ్పిటిసి, ఎంపిటిసి, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలవు తాయని తెలంగాణ బీసీ జేఏసీ ఛైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీల రిజర్వేషన్ లో కాకుండా అనేక సంక్షే మ కార్యక్రమాల్లో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీంతో బీసీలు తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి తీరని అన్యా యం ఆయన ధ్వజమెత్తారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిం చకపోగా ఉన్న 23 శాతం రిజర్వేషన్లను 17 శాతంకు తగ్గించిందని ఆరోపించారు. కాగా బీసీలంతా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకుని 52 శాతానికి పైగా సీట్లు సాధించడం జరిగిందన్నారు.
శాసన మండలి ప్రతి పక్ష నేత సిరికొండ మధుసూధనాచారి మాట్లాడుతూ ప్రభుత్వానికి మనను, మానవత్వం లేదని, గత రెండేళ్ళ నుంచి ప్రజలకు అన్యా యం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలోని రెండు కోట్ల మంది బీసీలకు ఇచ్చిన హమీలను అమలు చేయకుండా మోసం చేస్తుందని విమర్శించారు. రైతులు యూరి యా కోసం రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న ప్రభుత్వానికి చలనం లేదని మండిపడ్డారు.
ఈ సమావేశంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్, నాయకులు దేవయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ ముదిరాజ్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు జి. అనంతయ్య, తెలంగాణ విద్యార్థి సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్, నిఖిల్, నరేష్, భీమ్రావు, అశోక్ కుమార్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.