17 April, 2026 | 3:23 AM

ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏడీఈ

17-04-2026 12:26 AM

రూ.10 లక్షల బిల్లుకు రూ.30 వేల డిమాండ్ 

నల్లగొండ జిల్లా దేవరకొండలో ఘటన  

నల్లగొండ, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): విద్యుత్ లైన్ల మరమ్మతులకు సంబంధించిన బిల్లును మంజూరు చేసేందుకు లంచం ఆశించిన నల్లగొండ జిల్లా దేవరకొండ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) సిరికొండ సైదులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు కంబాలపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో అక్టోబర్ 2025లో వీచిన గాలివానకు దెబ్బతిన్న 33/11 కేవీ విద్యుత్ లైన్లను ఓ వ్యక్తి పునరుద్ధరించాడు.

ఇందుకు సంబంధించిన రూ.10 లక్షల బిల్లును ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపేందుకు సదరు ఏడీఈ రూ.30 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం తన కార్యాలయంలో లంచం డబ్బులు తీసుకుంటుండగా సైదులును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అతని వద్ద నుం చి నగదును స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ నిమి త్తం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.