జగిత్యాలలో నిరవధిక సమ్మె చేపట్టిన విద్యుత్ ఉద్యోగులు
జగిత్యాల, ఏప్రిల్ 8 ( విజయక్రాంతి ) :రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయిస్ జేఏసీ ఆదేశాల తో జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ ఆర్టిసన్, ఆన్ మ్యాన్‌ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు.ఈ సందర్భంగా విద్యుత్ డివిజన్ కార్యాలయం ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించిన ఉద్యోగులు, విద్యార్హతల ఆధారంగా ఆర్టిసన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయా లని, ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్ల కార్డులు ప్రదర్శించారు. టీజిఎస్పీడీసీఎల్ లో అన్ మాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లుగా విలీనం చేయాలని, 2026 పిఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ సంస్థల్లో 2016 డిసెంబర్ 4 కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తూ, ఇప్పటికీ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్నవారిని ఆర్టిసన్ గా గుర్తించాలని కోరారు.విద్యుత్ సంస్థలు బ్రిటిష్ కాలం నాటి విధానాలే కొనసాగుతున్నాయని పాలకులు, ప్రభుత్వాలు మారిన తమ బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు G.O.No.11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.




