9 April, 2026 | 3:12 AM

యువతిని వేధిస్తున్న యువకుడి అరెస్ట్

09-04-2026 01:09 AM
  1. అమ్మాయిలను వెంటపడి వేధిస్తే ఉపేక్షించేది లేదు

సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 08 (విజయ క్రాంతి): ప్రేమ పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకులు అరెస్టు అమ్మాయిలను వెంటపడి వేధిస్తే ఉపేక్షించేది లేదు, ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.ఒక యువతిని రుద్రంగి కి చెందిన సింగారపు గణేష్ అనే వ్యక్తి పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడుతు ప్రేమిస్తున్నని తనని పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని ఆ యువతి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని గణేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించాడం జరిగిందని తెలిపారు.

అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ప్రేమపెళ్లి పేరుతో వెంటపడడం, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. వేధింపులకు గురైన యువతులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.