12 July, 2026 | 5:38 PM

Breaking News

పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •   ప్రజలకు మరింత, పారదర్శకమైన పోలీస్ సేవలు   •  

జానంపేట పంచాయతీ కొత్త గుంపులో తీరిన కరెంటు కష్టాలు

13-02-2026 12:00 AM
  1. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు 

టౌన్ ఫీల్డర్‌కు మార్చిన విద్యుత్ శాఖ అధికారులు.

పినపాక ఫిబ్రవరి 12,(విజయ క్రాంతి):  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం, జానంపేట గ్రామపంచాయతీ పరిధిలోగల కొత్తగుంపు గ్రామంలో నివాసం ఉంటున్న ప్రజలు విద్యుత్ అంతరాయంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తగిన పరిష్కారం కాలేదు. ప్రస్తుత శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లిన వెంటనే కొత్తగుంపు   గ్రామస్తుల కోరికను నెరవేర్చారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ పోనెం ఉమామహేశ్వరి, ఉప సర్పంచ్  దాట్ల రాజేష్, ఏ ఎల్ ఎం మురళి శ్రీకారం చుట్టారు.

ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కల నెరవేరినందుకు  స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, స్థానిక సర్పంచ్ ఉప సర్పంచ్లకు, ప్రజలు ప్రత్యేక కృతజ్ఞ తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేరం వెంకటేశ్వరరావు, ఆవుల సునీల్, జరుపుల రాము, విజయ క్రాంతి రిపోర్టర్ అత్తి లక్ష్మీనారాయణ, జానంపేట వార్డు సభ్యులు పాటిబండ్ల సత్యనారాయణ, పోలిశెట్టి హరీష్, పొనుగోటి చందర్ రావు, గ్రామస్తులు కందులు జయరాజు, అన్నం అనిల్, బాలకృష్ణ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.