calender_icon.png 13 February, 2026 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీకట్లో చీలపల్లి..!

13-02-2026 12:00:00 AM

వీధిలైట్లు లేక అంధకారం

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

మునిపల్లి, జనవరి 12: మునిపల్లి మండలంలోని చీలపల్లి గ్రామంలో వీధిలైట్లు లేక చిమ్మ చీకట్లుగా మారింది. వేల రూపాయలు ఖర్చు చేసి వీధి దీపాలు ఏర్పాటు చేసినా గ్రామంలో మాత్రం అంధకారం వీడటం లేదు. రాత్రి అయితే చాలు గ్రామంలో బయటకు రావాలంటే గ్రామస్తులు జంకుతున్నారు. వీధి దీపాలు వెలుగడం లేదని పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. రాత్రి కాగానే గ్రామం మొత్తం అంధకారం అవుతుందని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చీలపల్లి గ్రామంలో వీధి దీపాలు వెలిగేలాగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు  కోరుతున్నారు.