7 April, 2026 | 2:30 PM

పులి సంచారంపై క్షేత్రస్థాయి పరిశీలన

13-02-2026 12:00 AM

సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 12 : కోహెడ మండలంలోని సింగరాయ గుట్టల పరిసర ప్రాంతాల్లో పులి కదలికలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, అటవీశాఖ జిల్లా అధికారి పద్మజారాణి తెలిపారు. గురువారం వారు క్షేత్రస్థాయిలో పర్యటించి, పులి పాదముద్రలు కనిపించిన ప్రదేశాలను పరిశీలించారు. కూరెళ్ల, శనిగరం, గుండారెడ్డిపల్లి, తంగళ్ళపల్లి గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పొలాలు, ఇతర పనుల నిమిత్తం ఒంటరిగా బయటకు  వెళ్లకూడదని సూచించారు. అడవి ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. పులి కదలికలు కనిపిస్తే స్థానిక పోలీసులకు లేదా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కమిషనర్ రష్మీ సూచించారు.