5 June, 2026 | 3:25 AM

దక్షిణ మధ్య రైల్వే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ ట్రైనింగ్ కమిషనర్‌గా ఎలియా

05-06-2026 01:38 AM

హనుమకొండ, జూన్ 04 (విజయ క్రాంతి): దక్షిణ మధ్య రైల్వే భారత్ స్కౌట్ అండ్ గైడ్ స్టేట్ ట్రైనింగ్ ఆఫీసర్ గా కాజీపేట పట్టణానికి చెందిన ఎర్ర ఎలియా ను సౌత్ సెంట్రల్ రైల్వే స్టేట్ సెక్రటరీ శేఖర్ బాబు నియమించారు. కాజీపేట ఎలక్ట్రికల్ లోకో షెడ్ లో సీనియర్ టెక్నీషియన్ గా పదవి భాద్యతలు నిర్వహిస్తున్న ఎర్ర ఎలియా పదోన్నతి పొందారు.

ఈ సంధర్భంగా ఎలియా  మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ ట్రైనింగ్ కమిషనర్ గా భాద్యతలు నిర్వహిస్తున్న క్రమం లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు తన సేవలు గుర్తించి తనకు  ఇచ్చినటువంటి పదవి భాద్యతలను ఎంతో సమర్ధత తో నిర్వహిస్తానని, తన పై నమ్మకంతో పదవి భాద్యతలు అప్పగించి నందుకు నందుకు అలాగే, సహాయ సహకారాలు అందించినటు వంటి రైల్వే అధికారులకు,తోటి ఉద్యోగులకు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థలో ఉన్నటువంటి నా సహచర మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.