5 April, 2026 | 5:32 AM

ఎమోషనల్ రివేంజ్ డ్రామా డైమండ్ డెకాయిట్

05-04-2026 12:00 AM

పార్ధ గోపాల్ నిర్మాణంలో దర్శకుడు సూర్య జీ యాదవ్ రూపొందిస్తున్న చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. ఇందులో పార్ధ గోపాల్ హీరోగా, మేఘన హీరోయిన్‌గా నటిస్తున్నారు. శనివారం ఈ సినిమా చిత్ర ట్రైలర్‌ను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మా త, డిస్ట్రిబ్యూటర్ వాకడ అప్పారావు, శివాజీరాజా, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీ రో పార్ధ గోపాల్ మాట్లాడుతూ.. “ట్రైలర్‌కు వస్తున్న స్పందన ఎంతో ఆనందంగా ఉంది. ఇది సాధారణ కథ కాదు, సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్ అన్నీ కలిసిన పూర్తి ఎంటర్‌టైనర్. ఈ ఎమోషనల్ రివేంజ్ డ్రామా ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతి ఇస్తుంది” తెలిపారు. రచయిత, దర్శకుడు సూర్య జీ యాదవ్ మాట్లాడుతూ.. “రెగ్యులర్‌గా కాకుండా డిఫరెంట్ కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందించాం. ప్రతి సీన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది” అన్నారు.

ప్రముఖ నిర్మాత శిరీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. “డైమండ్ డకాయిట్’ ట్రైలర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కథలో ఉన్న థ్రిల్ చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతుంది” అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పీఆర్; సినిమాటోగ్రఫీ: శివ అచంట; ఎడిటర్: శివ సర్వాణి; నిర్మాత: పార్ధ గోపాల్ (హీరో); కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సూర్య జీ యాదవ్.