18 April, 2026 | 4:39 AM

ఉద్యోగుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి

18-04-2026 01:28 AM

తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర అధ్యక్షులు ఈర్లపల్లి శ్రీనివాస్

అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 17: ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శిల రాష్ట్ర అధ్యక్షులు ఈర్లపల్లి శ్రీనివాస్ అన్నారు.  ఉద్యోగుల పీఆర్సీని వెంటనే అమలు చేసి.. సీపీఎస్ రద్దు.. ఓపీఎస్ అమలు చేసి పెన్షన్ దారులకు రావలసిన  బకాయిలను వెంటనే విడుదల టీజీఈజేఏసీ పిలుపు మేరకు శుక్రవారం మధ్యాహ్న భోజనం విరామం సమయంలో అబ్దుల్లాపూర్ మెట్ ఎంపీడీవో యు శ్రీవాణి , ఎంపీ ఓ  తుల్జా ప్రసాద్ రావు  ఆధ్వర్యంలో ( హయత్ నగర్) లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నల్ల బార్జీలతో పంచాయతీ కార్యదర్శులతో కలసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ పంచాయతీ కార్యదర్శిల రాష్ట్ర అధ్యక్షులు ఈర్లపల్లి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ... తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల  న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, రజినీకాంత్ రెడ్డి, రాజశేఖరరెడ్డి, శివప్రసాద్, బబిత, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.