12 June, 2026 | 5:34 PM

Breaking News

విశాల ఐక్య ఉద్యమాలకు రైతాంగం ముందుకు రావాలి   •   విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •  

కొత్తగూడెంలో గుండెపోటుతో ఉపాధి హామీ కూలి మృతి

13-02-2026 01:41 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): ఉపాధి హామీ కూలి పనులకు వెళ్లిన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన పగిడోజు రంగయ్య(66) శుక్రవారం ఆకస్మికంగా  నొప్పితో గుండెపోటుతో మృతి చెందారు. రోజు మాదిరిగానే గ్రామ సమీపంలోని గుట్ట పక్కన కెనాల్ దగ్గర ఉపాధి హామీ పనులు చేస్తుండగా రంగయ్య గుండె నొప్పితో కింద పడిపోయాడు. అప్రమత్తమైన తోటి కూలీలు సిపిఆర్ చేసిన అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య,ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రభుత్వ అధికారుల స్పందించి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కుటుంబ సభ్యులు కోరారు. దీనితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.