calender_icon.png 13 February, 2026 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిట్యాల మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం

13-02-2026 01:43:41 PM

చిట్యాల, ఫిబ్రవరి 13(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో చిట్యాల మున్సిపాలిటీ  పీఠం కాంగ్రెస్ పార్టీ (Congress party)  కైవసం చేసుకుంది. శుక్రవారం నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో వెలువడిన ఫలితాలలో  అధికార కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర  కొనసాగింది. హోరా హోరీగా సాగిన రెండో సాధారణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ వార్డులను గెలుచుకొని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నారు. మొత్తం 12 వార్డులకు గాను 9 కాంగ్రెస్, 2 బిఆర్ఎస్, 01 ఇండిపెండెంట్ ( ట్రాన్స్ జెండర్) గెలుపొందారు.