5 June, 2026 | 8:46 PM

Breaking News

తేజస్ అకాడమీ విద్యార్థులకు డిఫెన్స్ లో ఉద్యోగాలు   •   అంజనాపురం పాఠశాలకు రాష్ట్ర ఉత్తమ పర్యావరణ పాఠశాల అవార్డు   •   టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి   •   అమేజింగ్ ఇండియన్: మాచన రఘునందన్   •   ప్రపంచ పర్యావరణ దినోత్సవం   •   సీడ్స్ కేంద్రాలను తనిఖీ చేసిన గరిడేపల్లి ఎస్ఐ   •   డ్రంక్ అండ్ డ్రైవ్ లో రూ.3 లక్షలు జరిమానా   •   రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ పీవీ నరసింహారావు విగ్రహ ఏర్పాటుపై కాంగ్రెస్ కు లేదు   •   మొక్కలు నాటిన ప్రధాన న్యాయమూర్తి   •   పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం   •  

సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ద్వారా ఉపాధి

10-10-2025 12:48 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి అక్టోబర్ 9 (విజయక్రాంతి) : వివిధ సాంకేతిక కోర్సులలో శిక్షణ పొందడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. గురువారం భువనగిరి మండలం కేంద్రంలో ఐటిఐ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.. ఏ టీ సి సెంటర్ లో ఎంత మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని సంబంధిత అధికారులను  అడిగి తెలుసుకున్నారు.

ఏ ఏ కోర్సుల్లో విద్యార్థులు శిక్షణ ఇస్తున్నారని.విద్యార్థులకు అన్నివసతులు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. విద్యార్థులు అందరూ కూడా కష్టపడి శ్రద్ధ తో ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలని సూచించారు . రాబోయే కాలంలో మొత్తం ఈ అడ్వానస్డ్ టెక్నాలజీ రంగంలో జాబ్ లు ఉంటాయని అన్నారు.

డిగ్రీ ఇతర చదువుల ద్వారా మాత్రమే కాకుండా సాంకేతిక విద్య ద్వారా ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రైవేటు ఉద్యోగాలు కూడా పొందవచ్చును అన్నారు. ఏటీసీలో శిక్షణ పొందిన వారికి భవిష్యత్ బాగుంటుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.