10-10-2025 12:49:33 AM
దౌల్తాబాద్, అక్టోబర్ 9: దుబ్బాక నియోజకవర్గ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆ ధ్వర్యంలో బీసీఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింహులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బ లోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీనే సామాజిక న్యాయం, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కనకయ్య, మండల అధ్యక్షుడు పడాల రాములు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు లాలు, కర్నాల శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ సూరంపల్లి ప్రవీణ్, టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, బాల్ షేకర్ రెడ్డి, ఇమ్రాన్, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.