10-10-2025 12:47:54 AM
* మెదక్ పట్టణ బీఆర్‌ఎస్ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు
మెదక్, అక్టోబర్ 9 (విజయక్రాంతి):బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని విడు దల చేసిన జీవోను హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం జీవో నంబర్ 9 చట్టబద్ధత చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది, కేవలం బీసీలను మభ్య పెట్టడానికి 42 శాతం రిజర్వేషన్ పేరుతో స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత లాభం కోసం చేసిన రేవంత్ రెడ్డి డ్రామా అని బీఆర్‌ఎస్ మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల మీద నిజంగా నిజాయితీ ఉంటే పార్లమెంటులో, చట్టసభలో జీవో 9 షెడ్యూల్లో చేర్చడానికి తమ పోరాటాన్ని పార్లమెంటులో కొనసాగించాలని, కేవలం తెలంగాణలో హైకోర్టులో ఈ జీవో చెల్లదని తెలిసి కూడా బీసీలను మోసం చేయడానికి ఒక అబద్ధపు జీవోను తీసుకువచ్చి గత నాలుగు నెలలుగా డ్రామాలు చేసి విఫలమైందని విమర్శించారు. హైకోర్టు స్టే ప్రభుత్వ నిజస్వరూపానికి ప్రభుత్వం బీసీలకు ఇచ్చే 42 శాతం మీద వారి నిజాయితీ తేలిపోయిందన్నారు.