04-12-2025 01:42:38 AM
ప్రపంచ వేదికపై మన దేశ కీర్తిని చాటిన ఘనత దివ్యాంగులది
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ములుగు,డిసెంబర్3(విజయక్రాంతి):దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా పని5చేయాలని,దివ్యాంగులు సమాజానికి స్పూర్తి ప్రదాతలని,ప్రపంచ వేదికపై మన దేశ కీర్తిని చాటిన ఘనత దివ్యాంగులదని,వారితో ఆత్మీయంగా మెలగాల్సిన బాధ్యత సమాజంలో ప్రతీ ఒక్కరికీ ఉందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.
బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సామాజిక పురోగతిని ముందుకు తీసుకు వెళ్ళడానికి దివ్యాంగులను కలుపుకునే సమాజాన్ని రూపొందించడం అనే నేపథ్యం‘ తో ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో జిల్లా సంక్షేమ అధికారి తుల రవి అధ్యక్షతన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఈ సమాజానికి స్పూర్తి ప్రదాతలని, ప్రపంచ వేదికపై మన దేశ కీర్తిని చాటిన ఘనత దివ్యాంగులది అన్నారు. వారితో ఆత్మీయంగా మెలగాల్సిన బాధ్యత సమాజంలో ప్రతీ ఒక్కరికీ ఉందని సూచించారు.అనంతరం దివ్యాంగుల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో తెలియజేసిన పలు డిమాండ్లపై కలెక్టర్ స్పందించించి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
దివ్యాంగులు ఉపాధి హామీలో కూడా నిర్దేశించిన లక్ష్యం మేరకు పనిదినాలు పూర్తిచేయాలని, అలాగే దివ్యాంగులు దివ్యాంగుల స్వయం సహాయ సంఘాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వడ్డీలేని ఋణాలు వస్తాయి. కాబట్టి వాటిని వినియోగించుకొని ఆర్థిక స్థిరత్వం సాధించాలని దివ్యాంగులకు సూచించారు. ములుగు జిల్లాలో దివ్యాంగుల విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రత రంగాల్లో వారికి సేవలు అందించేందుకు మరింత అంకితభావంతో పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.