29-09-2025 01:40:15 AM
-కాంకేర్ జిల్లాలో ఘటన
-మహిళ సహా ముగ్గురు మావోయిస్టులు మృతి
-మృతి చెందిన వారి తలపై 14 లక్షల రివార్డు
రాయ్‌పూర్, సెప్టెంబర్ 28: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో మహిళా మావోయిస్టు సహా ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టుల తలలపై రూ. 14 లక్షల రివార్డు ఉన్నట్టు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఎన్‌కౌంటర్ వివరాలను కాంకేర్ ఎస్పీ ఇందిరా కల్యాణ్ మీడియాకు వివరించారు. ‘కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో డీఆర్‌జీ బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. మావోయిస్టులకు, భద్రతా బలగా లకు జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
మృతుల్లో మావో యిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యులు కూ డా ఉన్నట్టు గుర్తించాం. మృతి చెందిన వారిని సర్వాన్ మడ్కం, రాజేష్ అలియాస్ రాకేష్ హేమ్లా, బసంతి కుంజమ్‌గా గుర్తిం చాం. ఒకరిపై రూ. 8 లక్షలు, మరొకరిపై రూ. 5 లక్షలు, మరో వ్యక్తిపై రూ. 1 లక్ష రివార్డు ఉంది. ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు లభించాయి. ఎస్‌ఎల్‌ఆర్, 303 రైఫిల్, 12 హ్యాండ్ గన్స్ లభించాయి’ అని పేర్కొన్నారు. సర్వాన్ మావోయిస్టు కోఆర్డినేషన్ ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 252 మంది మావోయిస్టులు వివిధ ఎన్‌కౌంటర్లలో మరణిం చారని పోలీసులు పేర్కొన్నారు.
కాల్పుల విరమణ ప్రసక్తే లేదు: అమిత్‌షా
మావోయిస్టులతో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. నక్సల్ రహిత భారత్‌పై నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. ‘గందర గోళం సృష్టించేందుకే మావోయిస్టుల నుంచి ఓ లేఖ బయటకు వచ్చింది. మావోయిస్టులు లొంగిపోవాలని, కాల్పుల విరమణ అవసరం లేదని. ఆయుధాలు వీడి ముందుకు రండి’ అని ఆయన మావో యిస్టులకు పిలుపునిచ్చారు.