calender_icon.png 29 September, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యంత వైభవంగా గరుడ వాహన సేవ

29-09-2025 01:39:35 AM

  1. తనివితీరా శ్రీవారిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు 
  2. శనివారం రాత్రి నుంచే గ్యాలరీల్లో యాత్రికుల జాగారం
  3. అలిపిరి ఘాట్ రోడ్డులో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
  4. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ

తిరుమల, సెప్టెంబర్ 28: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవను కనులారా వీక్షించేందుకు భక్తులు పోటెత్తడంతో తిరుమల గిరు లు జనసంద్రంగా మారాయి. ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగిన గరుడు సేవను లక్షలాది మంది భక్తులు తనవితీరా వీక్షించారు. వేంకటేశ్వరస్వామివారు గరుడ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

తిరుమలలో సాయంత్రం 6.30 గం టల సమయంలో గరుడ సేవ మొదలు కా గా.. లక్షలాది మంది భక్తులు రాగా.. గోవింద నామస్మరణతో ఏడుకొండలు మార్మోగాయి. గరుడ సేవ సందర్భంగా మలయ ప్పస్వామివారికి మకరకంఠి, లక్ష్మీహారాన్ని అలంకరించారు. అయితే, ఈ ఆభరణాలను శ్రీవారి మూలవిరాట్టుకు అలకరిస్తారు. ఏడాది ఒకరోజు మాత్రమే.. కేవలం గరుడ సేవ రోజున మాత్రమే ఉత్సవమూర్తి అయి న మలయప్పస్వామివారికి అలంకరించడం విశేషం.

గరుడ సేవ సందర్భంగా తిరుమల క్షేత్రం జనసంద్రంగా మారింది. స్వామివారి ప్రియ వాహనమైన గరుత్మంతునిపై స్వామివారు మాడవీధుల్లో విహరించగా.. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై మలయప్ప స్వా మివారిని చూసి భక్తులు పులకించిపోయా రు. మాడవీధుల గ్యాలరీల్లోకి దాదాపు రెండు లక్షల మందికిపైగా భక్తులు చేరుకున్నారు. నందకం, రామ్బగీచా, లేపాక్షి ప్రాం తాల్లోనూ భక్తులు బారులు తీరారు.

తిరుమలలో వాహనాల పార్కింగ్ ప్రాంతాలన్నీ వా హనాలతో నిండిపోగా ప్రైవేటు వాహనాలను కొండపైకి నిలిపివేశారు. కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించారు.   సర్వాలంకార భూషితుడై గరుడ వాహనంపై విహరించిన స్వామివారిని చూసి భక్తులు తన్మయత్వం పొందారు. స్వామివారిపైకి కర్పూర హారతులు పలికి తమ భక్తిని చాటుకున్నారు. భక్తుల రద్దీ మేరకు టీటీడీ అధికా రులు ఏర్పాటు చేశారు.

ఇబ్బందులు లేకుం డా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా బ్రహోత్సవాల్లో భాగంగా స్వామివారు  ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలం కృతుడై భక్తులను కటాక్షించారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

వాహ నం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామి వారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. వా హనసేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.