పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
17-07-2026 02:11 AM
తాడ్వాయి, జూలై 16 (విజయక్రాంతి): తమ ఇంటి పక్కన, వీధులలో, పాఠశాల ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో భరత్ కుమార్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియాల గ్రామంలో గురువారం ఆయన ప్రాథమిక పాఠశాల, ప్రీ ప్రైమరీ, అంగన్వాడి కేంద్రాలను, పాఠశాల ఆవరణలో ఉన్న ఇంకుడు గుంతను, కంపోస్ట్ షెడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన అందించడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పం నర్సింలు, ఎంఈఓ రామస్వామి, కార్యదర్శి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






