21 August, 2026 | 12:27 PM

Breaking News

రాజీవ్ గాంధీ దేశానికే ఆదర్శం   •   పాలిటెక్నిక్‌ల విలీనాన్ని విరమించుకోవాలి   •   భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం... మహిళలు ప్రత్యేక పూజలు   •   ఆటోనగర్ ఏర్పాటుకు నూతన కార్యవర్గం ఎన్నిక   •   వేం నరేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు   •   ఒకే విగ్రహం.. రెండు నివాళులు..! కాంగ్రెస్‌లో మళ్లీ వేడెక్కిన చర్చ   •   కేసముద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో   •   హెచ్.సి.యూలో సీటు సాధించిన విద్యార్థినిని సన్మానించిన సర్పంచ్   •   ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేరుతో లబ్ధిదారుల్ని తికమక పెట్టదు   •   అమెరికా పర్యటన కొనసాగించండి... అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం   •  

ఓటమితో ముగింపు

12-06-2024 12:48 AM

 ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్

దోహా: ప్రతిష్ఠాత్మక ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో ఖతార్‌తో పోరులో భారత్ ఓటమి పాలైంది. మంగళవారం దోహా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 1 తేడాతో ఖతార్ చేతిలో పరాజయం చవిచూసింది. భారత్ తరపున 37వ నిమిషంలో స్ట్రుకర్ లల్లియన్‌జులా చాంగ్టే గోల్ సాధించగా.. ఖతార్ తరపున యూసఫ్ అయ్‌మెన్ (73వ నిమిషంలో), అహ్మద్ అల్ రవీ (85 ని.లో) గోల్స్ నమోదు చేశారు. మ్యాచ్‌లో తొలి అర్థభాగం ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ రెండో అర్థభాగంలో మాత్రం అదే జోరు కనబరచడంలో విఫలమై పరాజయం చవి చూసింది. ఇక భారత స్టార్ సునీల్ ఛెత్రీ రిటైర్మెంట్ అనంతరం తొలి మ్యాచ్ ఆడిన టీమిండియా ఒక గోల్ నమోదు చేయడం చెప్పుకోదగ్గ ప్రదర్శన. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో కువైట్ విజయం సాధించడంతో క్వాలిఫయర్స్ మూడో రౌండ్‌కు చేరే అవకాశాన్ని భారత్ కోల్పోయింది.