28 June, 2026 | 9:13 AM

ప్రిక్వార్టర్స్‌లో నాగల్

12-06-2024 12:48 AM

పెరుగియా: భారత ఏస్ టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్  పెరుగియా ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఇటలీ వేదికగా జరుగుతున్న టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో నాగల్ 7 (7/1), 6 నెర్మన్ ఫాటిక్ (బోస్నియా)పై గెలిచి రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను టై బ్రేక్‌లో సొంతం చేసుకున్న నాగల్ రెండో సెట్‌లో తన ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు. ప్రిక్వార్టర్స్‌లో నాగల్ స్థానిక ఆటగాడు అలెస్సాండ్రో గియాన్నెస్సీతో తలపడనున్నాడు. ఇటీవలే జర్మనీ వేదికగా జరిగిన హెయిల్‌బ్రోన్ నెకార్ కప్‌ను సుమిత్ నాగల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో 77వ ర్యాంకులో కెరీర్ బెస్ట్ అందుకున్న నాగల్ పారిస్ ఒలింపిక్స్‌లో ఆడే సువర్ణావకాశం లభించింది.