ఈద్గా లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
01-04-2025 12:00 AM
హనుమకొండ, మార్చి 31 (విజయ క్రాంతి): ఈ రోజు పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా మంత్రి కొండా సురేఖ వరంగల్ లోని పలు డివిజన్ ఈద్గా లో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొని ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా రంజాన్ ఉపావాసదీక్షలు చేసి నేటితో వీడ్కోలు పలుకుతున్న సందర్భంగా అల్లాహ్ ఎల్లప్పుడూ మీకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఎప్పుడూ ఇలా కలిసి మెలిసి ఉండాలని రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి , పలు డివిజన్ కార్పొరేటర్లు, మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.






