క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సాయం
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
హనుమకొండ, మార్చి 31 (విజయ క్రాంతి): అపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సిఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ రెడ్డి కాలనీకి చెందిన ఎండి నజీం అహ్మద్ కుమారుడు ఆదిల్ అహ్మద్ కు వైద్య చికిత్స కోసం హైదరాబాద్లోన ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం సిఎంఆర్‌ఎఫ్ ద్వారా 5 లక్షల రూపాయల విలువైన ఎల్‌ఓసిని మంజూరు చేయించారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి ఎల్‌ఓసి అనుమతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా ఎల్‌ఓసిని మంజూరు చేయించిన ఎంపీ కావ్యకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలోను బాలుడి పరిస్థితిని చూసి చలించిన ఎంపీ కావ్య, కడియం ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఫోన్ ద్వారా వైద్యులను అడిగి తెలుసుకున్న ఎంపీ మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.






