22 April, 2026 | 6:04 AM

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం

01-04-2025 12:00 AM

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం 

మహబూబాబాద్, మార్చి 31: (విజయ క్రాంతి)కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుందని,ఈ నేపథ్యంలోనే బంజారుల గోల్ గోలి లంబాడి,బంజారా భాష రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని ఇటీవల రాష్ట్ర శాసనసభలో చర్చించి ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయటం హర్షనీయమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా.జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. గోర్ గోలి భాషను గుర్తించిన సందర్భంగా సోమవారం మరిపెడ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

అనంతరం రామచంద్రు నాయక్ మాట్లాడుతూ.. గోరు బోలి భాషను భారత రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడం తెలంగాణ అసెంబ్లీలో చరిత్రాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు.  సీఎంకు బంజారా సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు. మానుకోట మార్కెట్ కమిటీ చైర్మెన్ సుధాకర్ నాయక్,మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి నాయక్,కాంగ్రెస్ నాయకులు వీసారపు శ్రీపాల్ రెడ్డి,కొంపెళ్లి సురేందర్ రెడ్డి,గండి వీరభద్రం,అలువాల ఉపేందర్,కొండం దశరథ, బొడ్డు వెంకన్న,కారంపుడి ఉపేందర్,దేవరశెట్టి లక్ష్మినారాయణ, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన ఉపాధ్యక్షులు జర్పుల విజయ్,రవికాంత్,మరిపెడ కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు జాటోతు సురేష్,బల్లెం రవి, తదితరులు పాల్గొన్నారు.